శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (18:03 IST)

వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసే ఔషధం : రాందేవ్ బాబా (Video)

దేశంతో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు ఔషధం కనిపెట్టినట్టు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి ఓ లేఖ రాశారు. గిలోయ్, అశ్వగంధ కాంబినేషన్‌తో కరోనాకు చికిత్స చేయవచ్చని తెలిపారు. 
 
ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన రోగి తీసుకున్నట్టయితే, అతని శరీరంలోని మొత్తం కణజాల వ్యవస్థపై ప్రభావం చూపి, వాటిని నాశనం చేస్తుందని, అయితే తాము తయారు చేసిన మందు, శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో అశ్వగంధ, గిలోయ్ తులశివతిలతో దీన్ని తయారు చేశామని, రోగులకు ఖాళీ కడుపుతోనూ, తిన్న తర్వాత కూడా ఇచ్చి పరీక్షలు చేశామన్నారు. తాము ఇప్పటికే 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. 
 
ఇప్పటికే ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ, కరోనాపై పోరులో సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించిన విషయం తెల్సిందే. 
 
అశ్వగంధలో సహజసిద్ధంగానే విటానోన్ (డబ్ల్యూఐ-ఎన్) పెరుగుతుందని, ఇది కరోనా ప్రధాన ప్రొస్టేట్‌పై ప్రభావం చూపిస్తోందని వెల్లడించింది. ఇప్పటికే గిలోయి, అశ్వగంధలను ఎన్నో ఏళ్లుగా డెంగ్యూ, మధుమేహం తదితర రోగాలపై వినియోగిస్తున్నారు. 
 
ఆయుర్వేదంలో వీటిని అమృతాలని కూడా పిలుస్తారు. డెంగ్యూ వచ్చినప్పుడు వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఉష్ణోగ్రతను పెరగకుండా చూస్తాయని గతంలోనే తేలింది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి తనవంతు పాత్రను పోషిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.