1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (13:26 IST)

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ బారి నుండి తప్పించుకున్న 9 దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనైన దేశాలలో కొన్ని దేశాలు మాత్రము వాటి తీవ్రతను తగ్గించి తమ దేశాలను సురక్షితంగా కాపాడుకుంటున్నాయి. ప్రపంచంలో 9 దేశాలు తమ దేశాలలో కరోనా కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గుముఖం పట్టిందని తేల్చి చెప్పాయి. ఇది ప్రపంచ దేశాలు ఆదర్శప్రాయంగా మారింది.
 
చెన్నైతో పోలిస్తే అందులో సగభాగం మాత్రమే జనాభా కలిగిన దేశమైన న్యూజీలాండ్ కరోనా వ్యాప్తి చెందిన వెంటనే కఠినమైన నిబంధనలను అమలుచేసి 72 రోజులు లాక్ డౌన్ పాటించింది. ఇక్కడ గత నెల 22వ తేదీ పరీక్షలలో గుర్తించిన కరోనా బాధితుడు కూడా జూన్ 8వ తేదీ ఆరోగ్యపరంగా మెరుగుపడ్డాడు.
 
అదేవిధంగా ఆఫ్రికా దేశంలో భాగమైన టాంజానియాలో పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటించారు. కొత్త కేసులు గురించిన పరిశోధనలను గడచిన 6 వారాలుగా నిలిపివేసిన టాంజానియా అక్కడ పూర్తిస్థాయిలో కరోనా కట్టడి అయ్యిందని తెలిపారు.
 
అతిచిన్న దేశమైన వాటికన్ గత 4వ తేదీ నుండి తమ దేశంలో కరోనా వైరస్ లేదని ప్రకటించింది. మొత్తం 14 మంది కరోనా బాధితులుగా గుర్తించగా ప్రస్తుతం అందరూ చికిత్స నిమిత్తం మెరుగుపడ్డారని తెలిపింది.