సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: శనివారం, 23 మే 2020 (16:32 IST)

జాలిపడి స్నేహితుడికి ఆశ్రయమిస్తే అతడి భార్యనే లేపుకెళ్లిపోయాడు

జాలిపడి స్నేహితుడికి ఆశ్రయమిస్తే అతడి భార్యనే లేపుకుపోయాడు ఒక వ్యక్తి. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరకక అల్లాడుతున్న స్నేహితునికి ఆశ్రయమిస్తే మొదటికే మోసం వచ్చింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇడుక్కీ జిల్లా మున్నార్ గ్రామానికి చెందిన లోథారియో మువత్తుపుజ పట్టణంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
 
లాక్‌డౌన్ విధించడంతో ఇంటికి వెళ్లే దిక్కులేక అక్కడే చిక్కుకుపోయాడు. తిండికి కూడా కరువైంది. ఇబ్బందులతో సతమతమవుతున్న అతనికి అదే పట్టణంలో ఉంటున్న చిన్ననాటి స్నేహితుడు గుర్తుకువచ్చాడు. తన బాధను అతనితో పంచుకున్నాడు. జాలి పడిన స్నేహితుడు ఇంటికి తీసుకువచ్చి తిండి పెట్టి ఆశ్రయమిచ్చాడు.
 
సాయం పొందిన కృతజ్ఞత కూడా మరిచిపోయి స్నేహితుని భార్యపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుని సుఖంగా చూసుకుంటానని చెప్పి నమ్మబలికాడు. ఆమెను వెంట తీసుకుని వెళ్లిపోయాడు. దీనితో ఏమి చేయాలో తెలియక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. భార్యను పిల్లలను మోసగించి తీసుకువెళ్లిపోయాడని మొరపెట్టుకున్నాడు.
 
పోలీసులు వారి జాడను కనిపెట్టి స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య మాత్రం ప్రియుడితోనే జీవితం సాగిస్తానని మొండికేసింది. పోలీసులు అక్రమ సంబంధం కేసు పెడతామని బెదిరించడంతో దారిలోకి వచ్చింది. నమ్మిన స్నేహితుడే మోసం చేయడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.