గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (19:47 IST)

మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది .. సుశాంత్ మరణంపై భూమిక ట్వీట్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై పలువురు నటీనటులు భావోద్వేగంతో కూడిన ట్వీట్లు చేస్తున్నారు. ధోనీ బయోపిక్ హీరో చనిపోయి వారం రోజులు దాటిపోయింది. అయితే, ధోనీ బయోపిక్ చిత్రంలో సుశాంత్‌కు అక్క పాత్రను పోషించిన భూమిక భావోద్వేగ ట్వీట్ చేసింది. 
 
మా అందరినీ వదిలి నీవు ఎందుకు ఎందుకు వెళ్లిపోయావంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'నీవు మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది. నీవు మాకు ఎందుకు దూరమయ్యావనే రహస్యం నీతోనే వెళ్లిపోయింది. ఆ దేవుడి చేతిలో నీవు భద్రంగా ఉంటామని నమ్ముతున్నా' అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ' సినిమాలో ప్రధాన పాత్రను సుశాంత్ పోషించాడు. ఈ చిత్రంలో ధోనీ అక్క క్యారెక్టర్ ను భూమిక పోషించింది. ఈ సందర్భంగా సుశాంత్ తో ఆమెకు ఆత్మీయ అనుబంధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మరణంతో ఆమె తీవ్రంగా కలత చెందారు.