సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (14:15 IST)

సితారతో మహేష్ బాబు సూపర్ గేమ్.. వీడియో వైరల్ (video)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు అభిమానులకు మంచి కిక్ ఇవ్వడంతో పాటు… అంచనాలు పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సర్కారు వారి పాట మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అయ్యాయి. తాజాగా మహేష్ విడుదల చేసిన ఓ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన తన కూతురు సితారతో టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతున్నాడు మహేష్.
 
కష్టమైన ఓ పెద్ద పదాన్ని సితార పలుకగా…మహేష్ అలా కాదు అంటున్నాడు. ఐతే సితార మాత్రం తాను ఆ గేమ్‌లో గెలిచినట్లు తండ్రితో వాదన చేస్తుంది. ఇక ఈ గేమ్‌లో సితార పాపతో మహేష్ సరదాగా ఆడుకుంటున్న వీడియో ఆసక్తి రేపుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..