పవన్ కళ్యాణ్ కోసం వర్కవుట్లు చేస్తున్న 'ఖుషీ' భామ, ఎందుకో తెలిస్తే షాకవుతారు...

Pawan Kalyan-Bhumika
ఐవీఆర్| Last Updated: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (18:05 IST)
పవన్ కళ్యాణ్ చిత్రం ఖుషీ ఆయన అభిమానులకు ఎంత ఖుషీ చేసిందో తెలిసిందే. ఖుషీ చిత్రాన్ని తల్చుకుంటే హీరోహీరోయిన్ల మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవలు గుర్తొస్తాయి. ఇక ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన భూమికా చావ్లా పెర్ఫార్మెన్స్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. సింప్లీ సుపర్బ్.

ఇక అసలు విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం పింక్ రీమేక్ చిత్రంలో నటించడం దాదాపు పూర్తయింది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు టాలీవుడ్ సినీజనం మధ్య ఓ హాట్ చర్చ నడుస్తోంది. అదేంటయా అంటే... పవన్ సరసన ఖుషీ భామ భూమికా చావ్లా నటించబోతోందట.

అందుకోసమే ఆమె స్లిమ్ అండ్ గ్లామరస్‌గా కనబడేందుకు వర్కవుట్లు చేస్తోందట. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత వుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
దీనిపై మరింత చదవండి :