శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:03 IST)

చెల్లెమ్మను గర్భవతిని చేసిన అన్నయ్య... తల్లిదండ్రులు ఏం చేశారంటే..?

తన తోబుట్టువు అయిన చెల్లెలిపైనే ఓ అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. దీంతో అతడి తల్లిదండ్రులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, వేలూరుకు చెందిన ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలుడు.. మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగడం అతడిని అలవాటైపోయింది. దీనికి తోడు మద్యం మత్తులో తన చెల్లెలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇంకా అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో జడుసుకున్న ఆ బాలిక ఎవరి వద్ద చెప్పలేదు. అయితే అన్నయ్య చేసిన దిక్కుమాలిన పనికి బాలిక గర్భం ధరించింది. 
 
ప్రస్తుతం ఆమెకు 8 నెలలు. ఈ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు షాకయ్యారు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేశఆరు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి, ఆ బాలుడిని చెంగల్పట్టు జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.