భార్య గర్భవతి అని తెలిసే ఆ పని చేశాడు.. ఏంటది..?

France couple
సెల్వి| Last Updated: శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:39 IST)
couple
ఫ్రాన్స్‌కు చెందిన అజోరా అనే వ్యక్తి తన మూడోసారి గర్భం ధరించిందని తెలిసి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఫ్రాన్స్‌కు చెందిన శాండోస్ అనే వ్యక్తి.. బ్యూటీషియన్. ఇతడు మార్సెలో అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే ఒక అమ్మాయి, ఓ అబ్బాయి సంతానంగా వున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా శాండోస్ తన భార్యతో ఇక పిల్లలు వద్దని చెప్పాడు. కానీ అతని మాట వినని భార్య అరోజా.. ఇటీవల మూడోసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. అది విన్న శాండోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు.

ఒకదశలో ఈ వాగ్వివాదం ముదిరింది. ఆవేశంలో శాండోస్ భార్య గొంతుకోసి హతమార్చాడు. భార్య గర్భిణిగా వుందన్న విషయాన్ని క్షణికావేశంలో భర్త మరిచిపోయాడు. తనకున్న ఇద్దరి పిల్లల భవిష్యత్తును గుర్తు చేసుకోలేదు. చివరికి పోలీసులు శాండోస్‌ను అరెస్ట్ చేశారు.దీనిపై మరింత చదవండి :