సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (16:56 IST)

#బుట్ట‌బొమ్మ సాంగ్‌కి శిల్పాశెట్టి డ్యాన్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వీడియో

Butta Bomma
బన్నీ, పూజా హెగ్డే జంటగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురంలో. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ చిత్రం ‘బాహుబలి 2’ రికార్డులను కూడా బ్రేక్ చేయడం విశేషం. 
 
ఇక ఈ చిత్రంలోని  ''బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే.."అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్‌ని భారీ స్థాయిలో ఆకట్టుకుంది. బుట్టబొమ్మ సాంగ్‌కి టిక్ టాక్‌లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 
 
తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టిక్ టాక్‌లో ఈ పాటకు సంబంధించిన వీడియో కోకొల్లలు. 
 
ఈ పాటకు సినీ ప్రేక్షకులే కాదు. సినీ సెలబ్రెటీలు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో సేమ్ టు సేమ్ బన్నీ వేసిన స్టెప్స్ వేసి శిల్పాశెట్టి అలరించారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shetty's sister