శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 జనవరి 2020 (17:13 IST)

మరదలితో బెడ్రూంలో రసపట్టులో బావ.. కళ్ళారా చూసిన మామ ఏంచేశాడంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మరదలితో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని అతడి మేనమామే దారుణంగా చంపేశాడు. కొడుకుతో కలిసి ఆ యువకుడి గొంతు నులిమి చంపేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశాడు.
 
లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న యువకుడు తన మరదలిని ప్రేమిస్తున్నాడు. శనివారం రాత్రి దొంగచాటుగా ఆమె ఇంటికి వెళ్లాడు. కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. వారిద్దరు రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో ఏదో అలికిడి కావడంతో బాలిక తండ్రి గదిలోకి వచ్చి లైట్ వేశాడు. అంతే... మంచంపై సీన్‌ చూసి షాకయ్యాడు. కూతురితో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని పట్టుకుని చితకబాదాడు. 
 
తన కొడుకు సాయంతో బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. రాత్రి నుంచి కొడుకు కనిపించకపోవడంతో యువకుడి తల్లిదండ్రులు ఆదివారం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన పొలంలో అతడి శవాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువకుడు తన మరదలితో ఫోన్లో మాట్లాడిన కాల్‌డేటా సేకరించారు. దీంతో అనుమానంతో ఆమెను ప్రశ్నించగా తన బావను తండ్రి, అన్న కలిసి చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తన కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.