సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 13 జనవరి 2020 (22:39 IST)

బర్త్ డే పార్టీలో ప్రేయసిని తీసుకెళ్ళి ఆ పని చేస్తుండగా...?

పరిస్థితులు ప్రతీవారిని పలు వైపుల నుండి పరీక్షిస్తాయు.. కాని ఆ క్షణం మనం ఎలా ఉన్నాం అనే దానిపైనే సర్వత్రా ఆధారపడి ఉంటుంది. బర్త్ డే పార్టీ ఓ యువకుడి పాలిట శాపమైంది. పార్టీ చేసుకుంటుంటే అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ జంటను చూసి వారించబోతే అతనిపై ప్రియుడు దాడి చేశాడు.
 
ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో కొందరు యువకులు బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు వచ్చారు. అక్కడే ఓ ప్రేమజంట అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూసిన సాయిసాగర్ అనే యువకుడు వారిని వారించాడు.
 
దీంతో రెచ్చిపోయిన ప్రియుడు మొబిన్ సాయి సాగర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సాగర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి సాగర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌పేట పోలీసులు మొబిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటికే 16 కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు.