Happy Anniversary Namrata Mahesh, 21 ఏళ్ల పెళ్లిబంధం సంబరాలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల పెళ్లిరోజు ఫిబ్రవరి 10. నేటితో వారికి పెళ్లి జరిగి 21 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు పంపుతున్నారు. తమ అభిమాన జంట కలకాలం వర్థిల్లాలంటూ ఆశీర్వాదాలు ఇస్తున్నారు.
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తొలిసారిగా 2000 సంవత్సరంలో వంశీ చిత్రం సెట్లో కలిసారు. ఆ తర్వాత 2005, ఫిబ్రవరి 10న ముంబైలో వీరి వివాహం జరిగింది. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రతా ఆ తర్వాత సినీ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. మహేష్ బాబుతో వివాహం జరిగాక సినిమాల్లో నటించడం మానేశారు. నమ్రత-మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయం చేస్తున్నారు.
మహేష్ బాబు-నమ్రతలకు గౌతమ్ కృష్ణ, సితార పిల్లలు. గౌతమ్ కృష్ణ చదువుతూనే నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమచారం. సితార ప్రముఖ ఆభరణాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.