సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (10:02 IST)

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో ప

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మోసం చేసిందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. కానీ, ఒక్కరంటే ఒక్క టాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ ట్వీటో లేదా వ్యాఖ్యో చేయక పోవడం గమనార్హం.
 
కానీ, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ మాత్రం ధైర్యంగా ఓ ట్వీట్ చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరో తేల్చుకుందాం అంటూ చేసిన ట్వీట్ సంచలనమైంది. అయితే, ఏపీ మొత్తం బంద్ జరుగుతున్నా.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు స్పందించక పోవడం నిజంగా విడ్డూరమనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, వారు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం.