గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (14:26 IST)

పవర్ స్టార్‌కు టాలీవుడ్ హీరో సపోర్ట్...

రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ హీరో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రను సోమవా

రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ హీరో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రను సోమవారం నుంచి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. 
 
ఈ యాత్రకు ముందు ఆయన సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి రాజకీయ యాత్రను ప్రారంభించారు. దీంతో  తెలంగాణ రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల ఆనందానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. 
 
ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ హీరో మద్దతు ప్రకటించారు. ఆ హీరో పేరు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరో. "మీ వెంటే మేము" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసి.. దాని కింద పవన్ ఫోటోను పెట్టారు.