ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (17:14 IST)

ఇష్టదైవం అంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ భూరి విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆయన తొలుత తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సోమవారం నుంచి బయలుదేరారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆయన తొలుత తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సోమవారం నుంచి బయలుదేరారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ మధ్యాహ్నానికి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. 
 
అక్కడ ఆయనకు ఆలయ పండితులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శినం అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల భూరి విరాళాన్ని పవన్ అందించారు. ఆలయ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్ హామీ ఇచ్చారు. 
 
ప్రత్యేక పూజల తర్వాత పవన్ కల్యాణ్‌ను అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. తనను చల్లగా చూడాలని స్వామిని మొక్కుకున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. స్వామి ఆశీస్సులతోనే తాను 2009లో పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు మరోసారి ఆయన గుర్తచేసుకున్నారు.
 
మరోవైపు పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా పవన్... పవన్ నినాదాలలో మార్మోగిపోయింది. అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు కొద్దిగా శ్రమించాల్సి వచ్చింది.