సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (11:36 IST)

పవన్‌కు వీరతిలకం దిద్ది హారతిచ్చి సాగనంపిన లెజినేవా

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన రాజకీయ యాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన రాజకీయ యాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్‌కు ఆయన సతీమణి అన్నా లెజినేవా ఎదురొచ్చి హరతి ఇచ్చి, నుదుట తిలకందిద్దారు. 
 
ఈ సందర్భంగా జనసేన కార్యాలయం వద్దకు పవన్ అభిమానులు పెద్దఎత్తున చేరుకుని సీఎం... సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసిన పవన్ అక్కడ నుంచి బయలుదేరారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న పవన్, స్వామి దర్శనానంతరం కరీంనగర్ బయలుదేరతారు. కొండగట్టులో స్వామి దర్శనం తరువాత ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. 
 
రాత్రికి అక్కడే బసచేసి, మంగళవారం ఉదయం 10.45కు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి కొత్తగూడెం చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు వెళ్లి, మధ్యాహ్నం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు. మొదటి విడత యాత్రలో భాగంగా పవన్.. మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే తాను యాత్ర చేపడుతున్నట్లు ఆయన ఇప్పటికే వెల్లడించారు.