శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (15:08 IST)

చదువుల్లో రాణించివుంటే ప్రొఫెసర్ అయివుండేవాడిని : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్‌ని అయ్యేవాడినని అన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్‌ని అయ్యేవాడినని అన్నారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆయన ఆదివారం ప్రార్థనలు చేశారు. 
 
ఈ సందర్భంగా పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ సహా అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులతో పవన్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, పోలాండ్ దేశంతో భారత్‌కు మంచి అనుబంధం ఉందని, పోలాండ్ చిత్రాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించుకోవచ్చన్నారు. 
 
ఇప్పటికే పోలాండ్ చిత్రాలును దక్షిణ భారతదేశంలో చిత్రీకరించిన విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇందుకు, ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ, తమ దేశంలో కూడా ఇక్కడి సినిమాల షూటింగ్‌లు జరుపుకోవాలని పవన్‌ని కోరారు.