సంబంధిత వార్తలు
- నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
- ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి
- బిజినెస్‌మేన్ భార్యను లొంగదీసుకుని ఏకాంతంగా వున్న ఫోటోలను చూపి బ్లాక్మెయిల్, రూ. 2 కోట్లు డిమాండ్
- శోభనం గదిలో భర్తకు నవ వధువు షాక్, రూ. 90 లక్షలు ఇస్తేనే నేను నీ దాన్నవుతానంటూ కండీషన్
- Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాటను ప్రశంసించిన బాలకృష్ణ
మళ్లీ మనం కలిసేంత వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు : కుమార్తె మృతిపై చిత్ర ట్వీట్
ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్రం తన దివంగత కుమార్తెను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. కుమార్తె నందన అందమైన ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన ఎమోషనల్ ట్వీట్ ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కిస్తోంది.
'నువ్వు ఇపుడు మాతో లేవన్న వాస్తవం ఎప్పటికీ బాధ కలిగిస్తూనే ఉంటుంది. కానీ, మనం మళ్లీ కలిసేంత వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు' అని చిత్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కుమార్తె మరణించి ఏళ్లు గడుస్తున్నా ఆ వేదన తనను ఇంకా వెంటాడుతూనే ఉందని ఈ పోస్ట్ ద్వారా ఆమె షెర్ చేశారు.
విజయ్ శంకర్‌తో వివాహమైన చాలా కాలం తర్వాత చిత్రకు గత 2002లో నందన ఓ కుమార్తె జన్మించగా, నందన అనే పేరు పెట్టారు. ఈ దంపతులకు ఏకైక సంతానం... 2011లో దుబాయ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో నందన ఈత కొలనులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ తీవ్ర విషాదం నుంచి చిత్ర కోలుకోవడానికి తనకు సంగీతం, ఆధ్యాత్మికత ఎంతగానో సహాయపడ్డాయని పలుమార్లు చెప్పుకొచ్చారు.
తన వ్యక్తిగత జీవితంలో గుండెల్లో ఎంతో వేదన ఉన్నప్పటికీ ఆమె తన వృత్తిని మాత్రం ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం భాషలతో సహా అనేక భాషల్లో కలిపి మొత్తం 25 వేలకు పాటలు పాడారు. ఆమెకు సౌత్ ఇండియన్ నైటింగేల్ అనే బిరుదు కూడా ఉంది. అలాగే, పద్మ భూషణ్‌తో పాటు పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
