1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Lavanya Tripathi Latest Photos

అందాల రాక్షసి ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది...

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ననాయన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి మార్కులు వేయించుకుంది.

Lavanya Tripathi
అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ననాయన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన అనేక చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో లావణ్య కెరీర్ రిస్క్‌లో పడిందని అనుకున్నారు. అలాగే, సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలేదు. హిట్స్ లేని కారణంగానే 'గీత గోవిందం'లో నటించే అవకాశం వచ్చినా ఆమె చేజార్చుకుంది.
 
ఈ నేపథ్యంలో లావణ్య ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నది. ఒకటి "అంతరిక్షం 9000కిలోమీటర్లు" కాగా, రెండో సినిమా నిఖిల్ "ముద్ర". ఈ రెండు సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఒకవైపు వచ్చిన అవకాశాల్లో నటిస్తూ మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ.. తన పరిధిని పెంచుకుంటోంది. ఈ రెండు సినిమాలు హిట్టయితే.. లావణ్య కెరీర్ తిరిగి గాడిలో పడుతుంది అనడం ఖాయం.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆకాశమే హద్దుగా కామసూత్ర బ్యూటీ అందాలు ఆరబోత