సంబంధిత వార్తలు
- "స్పైడర్" బుకింగ్స్ మొదలు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్
- 'స్పైడర్'లో ప్రేక్షకుల రిలాక్స్ కోసమే రకుల్ : డైరెక్టర్ మురుగదాస్
- దర్శకుడిని నమ్మే నటుడిని నేను... అందుకే అవి వచ్చాయి : మహేష్ బాబు
- 'ఇదిగో స్పైడర్ బోనస్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి' అంటున్న మహేష్ బాబు (Audio Song)
- 'స్పైడర్'లో 8 మినిట్స్ ఫైట్ కోసం రూ.20 కోట్లు ఖర్చు
రోబో 'స్పైడర్' కనిపించదు.. డబుల్ యాక్షన్ చేయలేదు: ప్రిన్స్
ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌లో కనిపి
ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌లో కనిపించే రోబో 'స్పైడర్' చిత్రంలో ఉండదట. ఈ విషయాన్ని హీరో మహేష్ బాబు బహిర్గతం చేశాడు.
ఈ చిత్రం టీజర్ మీకు గుర్తుందా? మహేష్ బాబు సీరియస్‌గా తన పని చేసుకుంటూ వెళుతుంటే, ఓ రోబో స్పైడర్ మెల్లగా ఆయన కాలు పట్టుకుని పైకి ఎక్కి, భుజంపై చేరి డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మహేష్ దాన్ని 'ష్...' అని హెచ్చరిస్తే, తోక ముడుచుకుని కూర్చుంటుంది.
అయితే, వాస్తవానికి సినిమాలో ఈ 'స్పైడర్' కనిపించదట. సినిమా కాన్సెప్ట్‌ను చూపించేందుకే ఆ టీజర్‌ను షూట్ చేశామని చెప్పాడు. చిత్రంలో తాను ఐబీ అధికారిగా పనిచేశానని చెప్పాడు. ఈ చిత్రంలో తాను డబుల్ యాక్షన్ చేశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, అటువంటిది ఉంటే ట్రయిలర్‌లో చూపించే వాళ్లమని చెప్పాడు.
ఇకపోతే.. 'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇక తన తదుపరి చిత్రం 'భరత్ అను నేను'లో చాలా సులభంగా నటించేస్తున్నానని మహేష్ బాబు చెప్పాడు.
