గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (11:49 IST)

"స్పైడర్" బుకింగ్స్ మొదలు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ భాషలలో విడుదల కాను

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాకి బుకింగ్స్ మొదలయ్యాయి.
 
యూఎస్‌లో జరగనున్న ప్రీమియర్ షో టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మహేష్‌కి ఓవర్సీస్‌లోను మంచి మార్కెట్‌తో పాటు.. ఫుల్‌క్రేజ్ ఉండడంతో తొలి రోజు అక్కడ కూడా భారీ వసూళ్ళు రావడం ఖాయమని చెబుతున్నారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. అభిమానులు టిక్కెట్స్ కోసం థియేటర్స్ దగ్గర క్యూలు కట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన 'స్పైడర్' చిత్రం వారం రోజులలో రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమని అంటున్నారు.