బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2017 (14:53 IST)

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు... ఇద్దరు హీరోయిన్లను వెంటబెట్టుకుని అక్కడికెళ్లాడు...

తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి

తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి సందడి చేస్తున్నాడు. 
 
ఇకపోతే ఈ షో ముగిసేందుకు మరో 9 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును సంప్రదించారట. ఐతే మహేష్ బాబు వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు.
 
దసరాకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవ కుశ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున మహేష్ బాబు చిత్రం స్పైడర్ కూడా విడుదలవబోతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ హౌసుకు వెళితే సంకేతాలు వేరేగా వెళ్లొచ్చనే అభిప్రాయంతో మహేష్ బాబు ఈ షోకి రాకూడదని భావించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ దసరా పండుగకు ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ బాబు కానుంది. మరి దసరా పండుగలో దసరా బుల్లోడు ఎవరో చూడాలి.