మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:59 IST)

ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న "జై లవ కుశ" (Trailer)

జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై

జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయేలా ఉంది.
 
ఈ పాత్రలకు సంబంధించిన టీజ‌ర్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఆదివారం ట్రైల‌ర్‌‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే యాట్యూబ్‌లో సాంగ్స్ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, తాజాగా విడుదలైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. 
 
కాగా, ఇందులో రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే 2,630,646 మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించగా, 125 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా, ఆరు వేల మంది డిజ్‌లైక్ చేశారు.