సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (11:01 IST)

"కొట్టేయడంతోపాటు కొట్టడం కూడా వచ్చురా" అంటున్న 'కుశ' (Teaser Release)

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలోని 'కుశ' పాత్రకు సంబధించిన టీజర్‌ను ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూర

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలోని 'కుశ' పాత్రకు సంబధించిన టీజర్‌ను ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశాడు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
 
ఇప్పటికే రిలీజైన జై పాత్రలో చాలా సీరియస్‌గా, లవకుమార్ పాత్రలో క్లాస్ లుక్‌తో కూల్‌గా కనిపించిన యంగ్ టైగర్.. కుశ టీజర్‌లో 'కొట్టేయడంతోపాటు కొట్టడం కూడా వచ్చురా' అనే డైలాగ్‌తో పక్కా మాస్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో జూనియర్‌కు జోడీగా నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. జై లవకుశ సెప్టెంబర్ 21న విడుదల కానుంది.