శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (07:01 IST)

'బిగ్ బాస్‌'‌ ఇంట్లో ఉండటమంటే డబ్బాలో వేసి మూతపెట్టినట్టే: సంపూ

'బిగ్ బాస్' రియాల్టీ షోలో పాల్గొనడం అంటే ఒక డబ్బాలే వేసి మూతపెట్టడమేనని ఈ షోలో పాల్గొని, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హీరో సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఈ షో నుంచి సంపూ ఎలిమినేట్ అయిన తర్వాత తొలిసారిగా మ

'బిగ్ బాస్' రియాల్టీ షోలో పాల్గొనడం అంటే ఒక డబ్బాలే వేసి మూతపెట్టడమేనని ఈ షోలో పాల్గొని, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన హీరో సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఈ షో నుంచి సంపూ ఎలిమినేట్ అయిన తర్వాత తొలిసారిగా మాట్లాడుతూ, బిగ్‌ బాస్ ఇంట్లో ఉన్నంత సేవు ఒక డబ్బాలో వేసి మూతపెడితే ఎలా ఉంటుందో అలా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. 
 
ఎందుకంటే.. నేను చాలా ఫ్రీ‌గా తిరిగే మనిషిని. ‘బిగ్ బాస్’లో ఒక రోజు, రెండు రోజులు... అలా గడిచిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం బయట ఓ గ్లాస్ సెట్ వేస్తున్నారు. లంచ్  చేసిన తర్వాత.. ఆ సెట్ లో కూర్చున్నాను. నాకేంటో శ్వాస ఆడనట్టుగా, ఏదో అయిపోతున్నట్టు అనిపించడంతో టెన్షన్ కు గురయ్యా. దీంతో, నన్ను బయటకు పంపించమని చెప్పాను.
 
‘అక్కడ వర్క్ జరుగుతోంది, కాసేపు ఆగు’ అని మావాళ్లు చెప్పారు. అయినా, టెన్షన్ తగ్గలేదు. శరీరం వణికిపోయింది. ఏదో అయిపోతుందనే భయం పెరిగింది. ఆ రోజే కాదు, అంతకుముందు కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. ఒక డబ్బాలో వేసి మూతపెడితే ఎలా ఉంటుందో, అలాంటి ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం నేను బయటకు వచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు అని వివరించాడు. 
 
అయితే, ఈ షోలో తాను అడుగుపెట్టిన తొలి రోజు తారక్ (జూనియర్ ఎన్టీఆర్) అన్నను కలిసిన తర్వాత ‘బిగ్ బాస్’షోను జయించినంత ఆనందం కలిగింది. ఆ రోజు తారక్ అన్నను కలిసి, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్‌కు వెళ్లా. వెళ్లగానే, అక్కడ కళ్లకు గంతలు కట్టేశారు. కళ్లకు గంతలు కట్టగానే నాకు టెన్షన్ మొదలైందన్నారు. 
 
అయితే, ఈ లోపు ఓ  వెహికల్ వచ్చింది. అక్కడి వాళ్లు చెవిలో చెప్పిన సూచనల ప్రకారం ఆ వాహనం ఎక్కాను. ‘బిగ్ బాస్’ హౌస్ డోర్ ముందుకు తీసుకువెళ్లి నా కళ్ల గంతలు విప్పేసి, వెంటనే లోపలికి పంపారు. ఇక, అక్కడ నుంచి ఎక్కడ ఉన్నాం? ఏంటి? అనే విషయమే తెలియదని చెప్పాడు.