గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (12:54 IST)

సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో.. ఎన్టీఆర్‌పై సంపూ ప్రశంసలు

తెలుగు బిగ్‌బాస్ షో నుంచి అర్థంతరంగా బయటకు వచ్చేసిన పార్టిసిపెంట్ సంపూర్ణేష్ బాబు. సంపూ బయటకు రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. సంపూ బిగ్‌బాస్ షో రూల్స్‌ను అతిక్రమించడంతో లక్షల్లో జరిమానా

తెలుగు బిగ్‌బాస్ షో నుంచి అర్థంతరంగా బయటకు వచ్చేసిన పార్టిసిపెంట్ సంపూర్ణేష్ బాబు. సంపూ బయటకు రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. సంపూ బిగ్‌బాస్ షో రూల్స్‌ను అతిక్రమించడంతో లక్షల్లో జరిమానా విధించినట్లు వార్తలొచ్చాయి.
 
వీటిపై సంపూ ట్వీట్ చేశాడు. తనకు పెనాల్టీ విధించినట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నాడు. అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను సంపూర్ణేష్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. 
 
"మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో అని, ఎన్టీఆర్ అన్నగారే తనకు బిగ్‌బాస్" అంటూ ట్వీట్ చేశాడు. ప్రేక్షక దేవుళ్లకు సంపూ క్షమాపణలు చెప్పాడు. ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్‌‌బాస్‌వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు.