మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 జులై 2025 (16:26 IST)

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

stray dogs
వీధుల్లో నడవాలంటేనే ఇప్పుడు భయం పట్టుకుంటోంది. దేశంలో వీధి కుక్కలు స్త్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై వెళ్లే పాదచారులపై విజృంభిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ కాలేజీ యువతి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వీధికుక్కలు వెంటబడ్డాయి. ఓ కుక్క ఆమె కాలు కండను పట్టుకుని కొరికి లాగింది.
 
ఇంతలో మరికొన్ని కుక్కలు ఆమెపై పడి దాడి చేసేందుకు ఉరికాయి. కాళ్లతో యువతి తన్నుతూ వుండటంతో కాస్తంత దూరం వెళ్లాయి. ఇంతలో ఆ యువతి స్నేహితురాలు వచ్చి కుక్కలపై రాళ్లు వేసి తరిమేసింది. ఈ ఘటన ఇండోర్ నగరంలోని శ్రీనగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉదయం ఆరున్నర గంటలకు జరిగింది.