శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:38 IST)

యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్.. యాప్ ద్వారా వీడియోలు పంచుకోవచ్చు

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది.

ఇంతకుముందులా వీడియోలను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే పంచుకునే వీలుండేది. కానీ త్వరలో అందించే అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
 
వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేసినట్లు యూట్యూబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ఇకపై యూట్యూబ్‌ వీడియోలను నేరుగా మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో యూట్యూబ్‌ యాప్‌లోనే పంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఆ వీడియో గురించి యాప్‌లోనే చర్చించుకోవచ్చని తెలిపింది.