శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (17:37 IST)

జై లవ కుశలో నివేదా థామస్ గ్లామర్ పంట, రాశీఖన్నా డ్యాన్స్ అదుర్స్

వెండితెరపై గ్లామర్ డోస్ పెంచకపోతే.. హీరోయిన్లకు అవకాశాలు కనుమరుగవుతాయనే విషయాన్ని నిన్నుకోరి హీరోయిన్ నివేదా థామస్ గ్రహించినట్లుంది. అందుకే ''జై లవ కుశ''లో నివేదా థామస్ మరింత గ్లామర్ డోస్ పెంచిందని సి

వెండితెరపై గ్లామర్ డోస్ పెంచకపోతే.. హీరోయిన్లకు అవకాశాలు కనుమరుగవుతాయనే విషయాన్ని నిన్నుకోరి హీరోయిన్ నివేదా థామస్ గ్రహించినట్లుంది. అందుకే ''జై లవ కుశ''లో నివేదా థామస్ మరింత గ్లామర్ డోస్ పెంచిందని సినీ జనం చెప్తున్నారు. జెంటిల్‌మేన్, నిన్నుకోరి సినిమాల్లో నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించిన నివేదా థామస్.. జై లవ కుశలో.. ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. 
 
ఈ క్రమంలో గ్లామర్ డోస్ పెంచింది. 'జై లవ కుశ'లో.. 'జై' పాత్రకి జోడీగా నివేదా కనిపిస్తుంది. పాత్ర పరంగా ఆమె గ్లామర్ డోస్ కాస్తంత పెంచాలి. అది తన కెరియర్‌కి కూడా అవసరమని భావించిందో ఏమో, ఎన్టీఆర్ సరసన గ్లామర్ డోస్ పెంచేందుకు ఏమాత్రం వెనుకాడలేదని సమాచారం. జైతో ఓ పాటలో నివేదా థామస్ అందాలను ఆరబోసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
మరోవైపు అందాల హీరోయిన్ రాశీఖన్నా కూడా ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశలో గ్లామర్ పంట పండిస్తుందని సినీ జనం అంటున్నారు. ఇంకా ఎన్టీఆర్ స్పీడ్‌కు తగినట్లు డ్యాన్స్ చేసేందుకు రాశీ ఖన్నా రెడీ అంటోంది. ట్రింగ్ ట్రింగ్ అనే పాటకు కాలు కదిపేందుకు అమ్మడు బాగానే ప్రాక్టీ చేసిందట.