శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (11:21 IST)

'స్పైడర్' - 'జై లవ కుశ'లకు షాకిస్తామంటున్న 'మహానుభావుడు'

దసరా పండుగకు పలువురి అగ్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా, సెప్టెంబర్ ఒకటో తేదీన బాలకృష్ణ చిత్రం "పైసా వసూల్" ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన 'స్పైడర్', జూనియర్ ఎన్ట

దసరా పండుగకు పలువురి అగ్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా, సెప్టెంబర్ ఒకటో తేదీన బాలకృష్ణ చిత్రం "పైసా వసూల్" ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన 'స్పైడర్', జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కానున్నాయి.
 
అయితే, మారుతి దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా 'మహానుభావుడు' సినిమా రూపొందింది. శర్వానంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా చేసింది. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే దసరాకి 'స్పైడర్', 'జై లవ కుశ' సినిమాలు థియేటర్స్‌కి వస్తుండటంతో నిర్మాతలు వెనక్కి తగ్గుతారని ఫిల్మ్ నగర్ భావించింది. 
 
కానీ, 'మాహానుభావుడు' నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. స్పైడర్, జై లవ కుశ చిత్రాలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, షాకిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ... తమకి కావలసిన ధైర్యాన్ని 'ఫిదా', 'అర్జున్ రెడ్డి' సినిమాలు ఇచ్చాయని అంటున్నారు. 
 
చిన్న సినిమాలుగా వచ్చిన 'ఫిదా', 'అర్జున్ రెడ్డి'లు వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాస్తున్నాయి. ఆ రెండు సినిమాల లక్షణాలు తమ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని అందుకే అనుకున్నట్టుగానే 'మహానుభావుడు' చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.