Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు వందరోజులు పూర్తిచేసుకుంది
Updated: Tue, 21 Apr 2026 (11:42 IST)
Mana Shankara Varaprasad garu 100 Days Poster
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన మన శంకర వరప్రసాద్ గారు వందరోజులు ప్రదర్శన సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
ఈనెల 21వ తేదీతో 100 రోజుల రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో 100 రోజుల రన్ అనేది చాలా అరుదైన అంశమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు సెంటర్స్ లో 100 రోజుల రన్ ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. మైదుకూరు, యర్లకుంట, ప్రాంతాల్లో మన శంకర వరప్రసాద్ గారు 100 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోవటం విశేషం. ఇక ఈ సినిమాను సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి