మొబైల్ కాన్సెప్ట్‌తో మాయా పేటిక చిత్రం
Viraj Ashwin, Payal Rajput
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ థాంక్యూ బ్రదర్ సినిమా తర్వాత నేను నటించిన చిత్రమిది. ప్రేక్షకుల నుంచి మళ్లీ నేను అంతే ప్రేమను ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం మన జీవితం మన చేతుల్లో కాకుండా.. ఎక్కువగా సెల్ ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి మొబైల్ కాన్సెప్ట్‌తో సినిమా ఇది. నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి.. అందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేష్‌గారికి, నిర్మాతలకు థాంక్స్ అన్నారు.
డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ మాయ పేటిక సినిమా స్కిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీ సినిమా ఇది. నన్ను నమ్మిన నిర్మాతలు శరత్, తారక్‌లకు..సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ అందరికీ థ్యాంక్స్ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ రొటీన్‌కి భిన్నంగా సినిమా తీయాలని అనుకున్నాం. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చాం. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమా మాయ పేటికను నిర్మించాం. ఇదొక సెల్‌ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ అనౌన్స్ చేస్తాం అన్నారు.
