1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Naveen Polishetty Superb Words About Mega Star Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని : హీరో నవీన్ పోలిశెట్టి

navin polishetty
తాను మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానినని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. నవీన్ హీరోగా, దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, అనగనగా ఒక రాజు పెళ్లి రిసెప్షన్ పేరుతో ఓ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఇందులో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు నవీన్ పోలిశెట్టి సమాధానమిచ్చారు. 
 
సామాన్య కుటుంబంలో పుట్టినవారు కూడా స్టార్‌గా ఎదగవచ్చని చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని, ఈ రోజు తన లాంటి ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానికి కారణం మెగాస్టారేనని గుర్తుచేశారు. ప్రేక్షకులు అందరూ ఆయన నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసి తమ సినిమా చూడటానికి వస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఆయనకు వీరాభిమానినని చెప్పుకున్నారు.
 
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చిత్రీకరించిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, నవీన్ హీరోగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు' జనవరి 14న థియేటర్లలో విడుదల అవుతోంది.
తర్వాతి కథనం
శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న