1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nenu student sir with U/A certificate

నేను స్టూడెంట్ సార్ కు యూ/ఏ సర్టిఫికెట్

Bellamkonda Ganesh, Avantika Dassani
Bellamkonda Ganesh, Avantika Dassani
హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి.
 
జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందని సెన్సార్ బోర్డ్ సభ్యులు నేను స్టూడెంట్ సార్ టీం ని అభినందించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ గా వుందని కితాబిచ్చారు.
 
ఈ చిత్రంలో గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని నటిస్తున్నారు. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
 కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.
తర్వాతి కథనం
హీరో నేనే, సైకో నేనే అంటున్న ప్రియమైన ప్రియ హీరో అశోక్‌