1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Niveda Thomas romance with sarvanand

మహానుభావుడు శర్వానంద్‌తో నివేదా థామస్ రొమాన్స్

వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజా సినిమాలో నివేదా థామస్ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే మహానుభావుడు సినిమాతో యూత్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన శర్వానంద్

Niveda Thomas
వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజా సినిమాలో నివేదా థామస్ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే మహానుభావుడు సినిమాతో యూత్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన శర్వానంద్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త సినిమాలో నటించే ఛాన్సుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ చిత్రంలో నివేదా థామస్ కీ రోల్ చేస్తారని సమాచారం. 
 
కాగా నివేదా థామస్ గ్లామర్‌తో పాటు సహజమైన అభినయాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లామర్ రోల్స్‌తో పాటు ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు నివేదా థామస్ సై అంటోంది. 
 
'తను వెడ్స్ మను'లో కంగనా రనౌత్ .. 'బర్ఫీ'లో ప్రియాంకా చోప్రా .. 'బాజీరావ్ మస్తానీ'లో దీపికా పదుకొనే చేసిన పాత్రలు అద్భుతమని నివేదా థామస్ అంటోంది. ఆ తరహా  పాత్రలు చేయాలని ఉందని తెలిపింది. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తానని చెప్పుకొచ్చింది.
About Writer
selvi
తర్వాతి కథనం
మగాడిదే తప్పంటే ఎలా? ఇద్దరు వ్యక్తుల గొడవను పబ్లిక్ చేస్తారా?