శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (15:28 IST)

అర్జున్ రెడ్డితో శర్వానంద్.. సందీప్ రెడ్డీనే దర్శకుడు?

పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో 'అర్జున్ రెడ్డి' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై శర్వానంద్, నానిలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కి

పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో 'అర్జున్ రెడ్డి' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై శర్వానంద్, నానిలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిని శర్వానంద్ కొనియాడాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాకు నాని శుభాకాంక్షలు తెలిపాడు. 2017 తెలుగు సినిమాకి క‌లిసి వ‌స్తోంద‌ని ట్వీట్ చేశాడు. 
 
ఇకపోతే.. అర్జున్ రెడ్డి సినిమా ఒక రేంజ్‌లో కనెక్ట్ అయ్యింది. దాంతో సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో శర్వానంద్‌తో కలిసి విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అర్జున్ రెడ్డి'కి వచ్చిన సక్సెస్ చూసిన శర్వానంద్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట.