ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ డేట్ ఫిక్స్
Prabhas, Radhesyam, teaser, poster
కాగా, ఈరోజు ప్రభాస్ సోలో స్టిల్‌ను విడుదల చేశారు. కాగా, జస్టిన్ ప్రభాకరన్ అందించిన బాణీలు చిత్రానికి వన్నె తెస్తాయని యూనిట్ చెబుతోంది. భారీ బడ్జెట్ తో రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.
ప్రేమికుల దినోత్సవం నాడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను బి రెడీ అంటూ యువి క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఇందుకోసం అందరికీ నచ్చేవిధంగా వీడియోను డిజైన్ చేశారు. ఆ వీడియోలో బాహుబలి నుంచి రాధేశ్యామ్ వరకు సోలో మోషన్ పోస్టర్‌ను చూపించారు. ఇప్పటివరకు మాస్ పాత్రలు చేసిన ప్రభాస్ ఇందులో ప్రేమ కోణాన్ని కూడా చూస్తారంటూ యూనిట్ చెబుతోంది. మరి టీజర్ ఎలా వుంటుందో చూడాలి.

