మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (09:49 IST)

పవర్ స్టార్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. వీరమల్లు ఖాయమా?

Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న పీరియాడిక్ కథలో నటిస్తున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ సినిమా పేరు విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మొదట సినిమాకి విరూపాక్ష పేరు పెట్టారని అన్నారు. ఆ తర్వాత సినిమా పేరు ఓం శివమ్ అని, హరహర వీరమల్లు ఫైనల్ అయిందని, ఈ పేరును రిజిస్టర్ కూడా చేయించారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. పవన్- క్రిష్ సినిమాకి మరో పవర్ ఫుల్ పేరును ఫిక్స్ చేశారని, ఈ చిత్రానికి "వీరమల్లు" అనే పేరును ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. 
 
ప్రస్తుతం పవన్ సినిమాకి అనేక పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ వజ్రాల దొంగగా కనిపిస్తాడట. అయితే... ఆ పాత్రకు వీరమల్లు టైటిల్‌ సరిగ్గా ఉంటుందని క్రిష్‌ భావిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. అతి త్వరలోనే చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌పై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.