ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:35 IST)

ఫ్యాన్‌కు షాకిచ్చిన పూజా హెగ్డే.. ఆ ఫోటో షేర్ చేయమంటే..?

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ఆ కోవలో తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాములో నెటిజన్స్‌తో కొద్ది సేపు చాట్ చేసింది. చాటింగ్‌లో భాగంగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. 
 
ఓ నెటిజన్ పూల్‌లో ఉన్న ఫొటోని షేర్ చేయమనగా, పూల బికినితో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇక మరో నెటిజన్ అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోని షేర్ చేయమనగా, ఆయన తనయుడు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
 
మరో నెటిజన్ నేక్డ్ ఫొటో పోస్ట్ చేయమనగా, దానికి పూజా హెగ్డే తన పాదాల ఫొటో తీసి పోస్ట్ చేసింది. దీంతో సదరు నెటిజన్ కంగుతిన్నాడు. పూజా హెగ్డే ఆ ఫొటో పోస్ట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటబ్బా అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. 
 
తన ఫ్యామిలీ ఫొటోలు, టూర్ ఫొటోస్ కూడా పూజా షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.