సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (16:34 IST)

అభిమాని పెళ్లికి హాజరైన సూర్య.. వధువు మెడలో తాళికట్టే సమయానికి..?

Surya
తమిళ స్టార్‌ హీరో సూర్య ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ మీద ప్రేమను చాటుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ఓ అభిమాని పెళ్లికి వెళ్లి ఆశీర్వదించాడు. సూర్య వీరాభిమాని, ఆలిండియా సూర్య ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యుడు హరికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య వివాహ సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 
 
వధువు మెడలో కట్టే తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కు అందించాడు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు నిల్చొని పెళ్లి తంతును దగ్గరుండి జరిపించాడు. మీ ప్రయాణం సంతోషంగా సాగాలంటూ వధూవరులను మనసారా ఆశీర్వదించాడు. కాగా బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ తన పెళ్లికి విచ్చేయడంతో సదరు అభిమాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.