బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (13:01 IST)

ట్రంప్‌ చిన్న కుమార్తెకు ఎంగేజ్‌మెంట్.. ట్విట్టర్‌లో ఫోటో వైరల్

Tiffany Trump
అమెరికా శ్వేతసౌధాన్ని ట్రంప్‌ కుటుంబం మరి కొన్ని గంటల్లో వీడనుంది. అయితే వెళ్లే ముందు ఓ చిన్న పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫ్పనీ ట్రంప్‌ ఎంగేజ్‌మెంట్‌ మంగళవారం జరిగింది. టిఫ్ఫనీ ట్రంప్‌ (27)...ట్రంప్‌, ఆయన రెండో భార్య మార్లా మాప్లెస్‌ ఒక్కగానొక్క కుమార్తె. ఈ విషయాన్ని టిప్ఫనీ ట్రంప్‌ తెలిపారు. తన బారు ఫ్రెండ్‌ మైఖేల్‌ బౌలోస్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. 
 
వైట్‌ హౌస్‌లో తన తండ్రి గడిపిన చివరి రోజు... గుర్తిండిపోయేలా తన బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగిందని, మైఖేల్‌తో రాబోయే జీవితానికి ఆశ్వీరాదం లభించినట్లైందని, సంతోషంగా అనిపించిందని అన్నారు. తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బౌలోస్‌ అదే ఫోటోను తన సొంత ఇన్‌స్ట్రా గ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ..తదుపరి ఆధ్యాయం కోసం ఎదురుచూస్తున్నామని, ఐలవ్‌యూ హనీ అని రాసుకొచ్చారు.