గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:10 IST)

సుశ్మిత ఓ ఫైట‌ర్, డాడీని ఫాలో అవుతుంది: రామ్‌చ‌ర‌ణ్‌ (video)

సుశ్మిత మా ఫ్యామిలీకి ప్ర‌త్యేక‌మైంది. త‌ను 79 నుంచి డాడీని ఫాలో అవుతుంది. ఆయ‌న చెప్పిన స్పూర్తిదాయక మాట‌లతో త‌ను ఫైట‌ర్‌గా ఎదిగింది. జీవితంలో త‌న‌నుకున్నది సాధించింది. రంగ‌స్థ‌లం సినిమా అప్పుడు కూడా న‌న్ను బాగా చూసుకుంది. ఒక‌టికి రెండుసార్లు సీన్ స‌రిగ్గా రాక‌పోయినా ఆమె కోసం మ‌ళ్ళీ చేశాను.
 
ఎందుకంటే తెల్లారి లెగిస్తే మ‌ళ్ళీ ఇంట్లో మొఖం మొఖం చూసుకోవాలి. అంటూ చ‌లోక్తులతో స‌ర‌దాగా ర‌క్తిక‌ట్టించారు... మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్‌లో జ‌రిగిన షూట్ అవుట్ ఎట్ అలైర్‌.. అనే వెబ్ సిరీస్ విడుద‌ల సంద‌ర్భంగా మాట్లాడారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, జీ5 తెలుగు సిరీస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌.. ఈనెల 25న జి5 ఓటీటీలో విడుద‌ల కానుంది.
 
ఈ సందర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. సుశ్మిత‌... మా ఫ్యామిలీనుంచి ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకుంది.  79 నుంచి డాడీతో స్పూర్తిగా తీసుకుని ఒక‌ర‌కంగా ఫైట‌ర్‌గా ఎదిగింది. త‌ను చేసే వృత్తిలో  కొత్త‌ద‌నంగా వుండాల‌ని ప్ర‌య‌త్నించేది. రంగ‌స్థ‌లం ఆమె ప‌నిత‌నం చూశాను. త‌న‌కు మా బావ విష్ణు మంచి స‌పోర్ట్‌గా నిలిచాడు.
 
ఇక ఆనంద్‌ రంగా చేసిన ఓయ్ పాట‌లు బాగా న‌చ్చాయి. జిమ్‌కెళ్ళినా వింటుంటేవాడిని. ఇయ‌ర్ ఆరంభంలో క‌ంటే ఎండింగ్ ఎలా వుంద‌నే మ‌ఖ్యం. మ‌ర్చిపోలేని ఇయ‌ర్‌గా వున్న ఈ ఇయ‌ర్. మంచి సినిమా వ‌చ్చింద‌ని ఆశిస్తున్నాను. ఇందులో ప్ర‌తి ఒక్క‌రూ బాగా న‌టించారు అని తెలిపారు.
 
సుశ్మిత మాట్లాడుతూ... ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌కాంత్‌.. గొప్ప‌గా న‌టించారు. మంచి కంటెంట్‌తో తీసిన సిరీస్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌క‌ముంది. నాకు ఎంతోమంది స‌పోర్ట్ చేశారు. అందుకే అనుకున్న టైంలో జీ5కు అందించ‌గ‌లిగాం. దీనికి ప‌నిచేసిన టీమ్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను.
 
ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌కాంత్‌, నందినీరాయ్‌, తేజ‌, సందీప్ సాహు, గాయ‌త్రి గుప్త త‌దిత‌రులు న‌టించారు. కెమ‌రా: అనిల్ భండారీ, నిర్మాత‌లుః సుశ్మిత కొణిదెల‌, విష్ణు, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్‌రంగ‌.