గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (21:49 IST)

అందరూ స్టార్ట్ చేసారు, మరి పూరి ఫైటర్ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు?

కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిన తర్వాత ఇప్పుడిప్పుడు షూటింగ్‌లు స్టార్ట్ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సాయితేజ్.. ఇలా హీరోలు షూటింగ్ స్టార్ట్ చేసారు కానీ... స్పీడుగా సినిమాలు తీసే పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు.
 
ముంబాయి సెట్‌ను హైదరాబాద్‌లో వేసి రామోజీ ఫిలింసిటీలో ఫైటర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఫైటర్ టీమ్ అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఎప్పుడు ఫైటర్ షూటింగ్‌కి వెళతాడో చెప్పడం లేదు. 
 
దీంతో అసలు పూరికి ఏమైంది..? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే... ఫైటర్ మూవీ నిర్మాణంలో కరణ్‌ జోహార్ పార్టనర్.
 
అయితే కరణ్‌ జోహార్.. సుశాంత్ ఆత్మహత్య జరిగినప్పటి నుంచి అతనిపై విమర్శలు రావడంతో సైలెంట్ అయిపోయాడు. అలాగే ఇందులో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నెపోకిడ్ విమర్శలు ఎదుర్కొంటుంది. అందువలన ఈ సినిమా షూటింగ్ విషయంలో కంగారు పడడం లేదట పూరి. త్వరలోనే పూరి - కరణ్ జోహార్ - ఛార్మి ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఫైటర్ పైన క్లారిటీ వస్తుందట. మరి... ఏ నిర్ణయం తీసుకుంటారో..? ఫైటర్‌ని ఎప్పటి నుంచి సెట్స్ పైకి తీసుకెళతారో..?