పూరి ఫైటర్ ఏం చేస్తున్నాడు..? షూటింగ్ ప్రారంభించేది ఎప్పుడు..? ఎక్కడ..?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఓ భారీ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని పూరి - ఛార్మి - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఈ టైటిల్ మార్చనున్నారని సమాచారం. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా రావడంతో దసరా రిలీజ్ ప్లాన్ మారింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే... ముంబాయిలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు కానీ.. కరోనా అక్కడ తీవ్రంగా ఉండటంతో ముంబాయిలో ఇప్పటిలో షూటింగ్ చేయడం కుదరదు. అందుచేత రామోజీ ఫిలింసిటీలో ముంబాయి సెట్ వేసి అక్కడ షూటింగ్ చేయనున్నారని తెలిసింది. కరోనా కాస్త తగ్గిన తర్వాత రామోజీ ఫిలింసిటీలో ముంబాయి సెట్ పనులు ప్రారంభించనున్నారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది.
ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. విజయ్‌కి కొత్త ఇమేజ్ తీసుకువచ్చేలా ఈ సినిమా ఉంటుందని టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అవుట్‌పుట్ చూసి కరణ్ జోహార్ చాలా హ్యాపీగా ఫీలయ్యారని... ఈ సినిమా తర్వాత పూరితో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని టాక్. మరి... ఆ రెండు సినిమాలు ఎవరితో ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.