గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (23:37 IST)

పూరి.. ఆ టైటిల్‌ని మెగా హీరోకి ఇచ్చేసాడా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. పూరి - ఛార్మి - కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే... ఈ మూవీకి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నారు.
 
ఇప్పుడు ఈ టైటిల్‌ని మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే... ఈ టైటిల్‌ను తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్‌లో వేరే ప్రొడ్యూసర్ ఆల్రెడీ రిజిష్టర్ చేయించారు.
 
దీంతో ఈ సినిమా కోసం వేరే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. టైటిల్‌ను ఫిక్స్ చేసారు. త్వరలో ఎనౌన్స్‌మెంట్ ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. పూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు.
 
ఇదిలా ఉంటే... పూరి పెట్టాలనుకున్న ఫైటర్ టైటిల్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ మూవీకి పెట్టుకునేందుకు పూరి ఓకే చెప్పారని తెలిసింది. త్వరలో వరుణ్ తేజ్ మూవీ టైటిల్ ఫైటర్ అని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది. మరి... పూరి టైటిల్‌తో రానున్న వరుణ్ తేజ్‌కి ఈ టైటిల్ ఎంతవరకు కలిస్తుందో..?