శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:15 IST)

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీని పూరి- ఛార్మి- కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో పూరి వరుసగా కథలు రాస్తున్నారు. చిరంజీవి కోసం పూరి కథ రాసారని వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోసం కూడా పూరి కథ రాసారని మరో వార్త వచ్చింది. అలాగే వెంకీ 75వ చిత్రం కోసం పూరిని కాంటాక్ట్ చేసారని కూడా ఓ వార్త వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కోసం కూడా పూరి ఓ స్టోరీ రెడీ చేసారట. ఇప్పటివరకు నాగ్ - పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేసారు. ఇప్పుడు మూడవ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో నాగ్‌తో పూరి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సెట్ అయ్యిందని బలంగా వినిపిస్తుంది.