గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

ధనుర్మాసంలో తిరుప్పావై పఠిస్తే..? కోరుకున్న వరుడు..?

Andal
ధనుర్మాసంలో బ్రహ్మముహూర్త కాలంలో ఆలయాలను సందర్శించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంకా ఆలయాల్లో తిరుప్పావై, తిరువెంబావై పాశురాలను పఠించడం ద్వారా పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వివాహ అడ్డంకులు, విఘ్నాలు తొలగిపోతాయి. ధనుర్మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంతో వాయు శక్తి, స్వచ్ఛమైన గాలి భూమి మొత్తం వ్యాపించి వుంటుంది. ఆ స్వచ్ఛమైన గాలిని శ్వాసించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరానికి కొత్త ఉత్తేజం లభిస్తుంది.
 
ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఆలయాల సందర్శనంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. అలాగే ఈ నెలలోనే గోదాదేవి రంగనాథ స్వామిని వివాహమాడేందుకు వ్రతం ఆచరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా తిరుప్పావైతో 12 ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (గోదాదేవి) స్వామిని స్తుతించగా, తిరువెంబావైని మాణిక్య వాసగర్ ఆలాపించారు. తిరువెంబావై శైవానికి సంబంధించింది. 
 
తిరువెంబావై అనే పాశురాలను మాణిక్య వాసుగర్ పంచభూత స్థలాలలో ఒకటైన అరుణాచలేశ్వరంలో ఆలాపించినట్లు చెప్తారు. అందుకే ధనుర్మాసంలో పెళ్లి కాని యువతులు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి.. సామూహికంగా తిరుప్పావై స్తుతి చేయడం.. రంగ వల్లికలతో వీధులను అలంకరించి.. దీపాలను వెలిగించడం చేస్తే.. మనస్సుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందని ఐతిహ్యం.