బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (19:33 IST)

శివునికి ఇష్టమైన నక్షత్రం ఆరుద్ర.. ఆ రోజున నటరాజ స్వామిని దర్శిస్తే?

ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ప్రీతికమైనది. గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ.. నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని వున్నారు. అందుకే ఆరుద్ర నక్షత్రానికి ప్రాధ్యాన్యత వుంది. అలాగే ధనుర్మాసం కూడా విశిష్టమైంది. అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకమైనది. శివకేశవుల పూజకు శ్రేష్టమైనది. 
 
అలాగే మాసాల్లో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ చేయాలి. నటరాజస్వామిని దర్శించుకోవాలి. అర్చన చేయాలి. ఆరుద్ర నక్షత్రం రోజున ఉపవసించి.. గృహంలో పూజలు చేసి.. నైవేద్యం సమర్పించాలి. ఆలయాల్లో జరిగే ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొనాలి. ఆరుద్ర దర్శనం చేయాలి. ముఖ్యంగా సంవత్సరానికి ఆరుసార్లు మాత్రమే నటరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. 
 
అందులో ఒక రోజు ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రమే. ఇది జనవరి పదో తేదీ గడిచినా.. ప్రతీ నెలా ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ లేదా శివునికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈతిబాధలుండవు. 
 

సోమవారం లేదా గురువారాల్లో నటరాజ స్వామికి అర్చన చేసినట్లైతే, శివతాండవ స్తోత్రాన్ని పఠించినట్లైతే శివుని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.