శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (18:02 IST)

బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే? (video)

ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. బిల్వ పత్రాల్లో రకాలు వున్నాయి. వాటిలో మహా బిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనేవి వున్నాయి. ముక్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి. ఈ బిల్వ పత్రాలతో శివపరమాత్మను పూజించడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు. 
 
అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే.. సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి. రోజూ శివునికి బిల్వార్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయడం మంచిది. బిల్వ పత్రాలతో పూజించిన శివుడిని పూజించినట్లైతే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని విశ్వాసం. 
 
కానీ బిల్వ పత్రాలను సోమవారం, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, అష్టమి, నవమి తిథుల్లో చెట్టు నుంచి తీయడం కూడదు. దానికి బదులు ముందు రోజే బిల్వ పత్రాలను తీసి వుంచుకోవడం మంచిది. ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా వుంచి పూజించవచ్చునని పండితులు చెప్తున్నారు. పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్లీ అర్చనకు ఉపయోగించవచ్చు. 
 
ఇందులో ఎలాంటి దోషం లేదు. బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచడం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.