కోటి సోమవారం నేడే.. శ్రవణ నక్షత్రం.. ఉపవాసం వుంటే..? (video)

సెల్వి| Last Updated: సోమవారం, 4 నవంబరు 2019 (13:40 IST)
నవంబర్ 4న కోటి సోమవారం. ఈ పుణ్యప్రదమైన రోజువు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శివాలయాలన్నీ నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. అదీ సోమవారం, శ్రవణ నక్షత్రం రావడంతో ఆ రోజును కోటి సోమవారం వ్యవహరిస్తారు.

ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్‌ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడియున్నది. ఈరోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలం లభిస్తుంది.

నవంబర్‌ 4 సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని పురాణాలు చెప్తున్నాయి.

సోమవారం ఎవరి శక్తి అనుసారం వారు దీక్షగా ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివుడికి దగ్గరగా ఉపేన వాసం.. అంటే ఉపవాసం చేయండి. అనంత పుణ్యఫలాలలను పొందండి.. అంటున్నారు.

ఇంకా ఆలయాల్లో శివునికి అభిషేకం చేయించడం, నేతితో దీపమెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ నేతితో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.
దీనిపై మరింత చదవండి :